లక్నో: ఆలయం బయట ఉన్న బాలికను ఒక వ్యక్తి వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. (Drunk Man Molests Girl) దీంతో భయపడిన ఆ బాలిక అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక ఐదో తరగతి చదువుతున్నది. ఆలయంలో ప్రార్థన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్తున్నది.
కాగా, ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆ బాలికను చూశాడు. ఆమెను బలవంతంగా దగ్గరకు తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి వేధింపుల నుంచి ఆ బాలిక తప్పించుకున్నది. అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ బాలిక ఇంటికి చేరిన తర్వాత తన కుటుంబానికి ఈ విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు అమిత్ తన కుమార్తెను వేధించినట్లు ఆరోపించింది. గతంలో కూడా పలుమార్లు అతడు ఇలా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు అమిత్‌ను అరెస్ట్ చేశారు. అతడు మద్యం మత్తులో ఇలా చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. కాగా, సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే బహిరంగంగా బాలికను ఒక వ్యక్తి వేధిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంపై నెటిజన్లు షాక్ అయ్యారు.
यूपी के मेरठ में मंदिर से लौट रही लड़की के साथ दिनदहाड़े छेड़छाड़ हो रही है
सोचिए कहने को गुंडे प्रदेश छोड़कर जा चुके थे फिर ये क्या है ? pic.twitter.com/yOiYWGsYVz
— Nigar Parveen (@NigarNawab) November 1, 2024