పాట్నా: మద్యం సేవించిన మత్తులో ఉన్న పోలీస్ అధికారి ఒక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. (Drunk Cop Beaten By Mob) ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, స్థానికులు ఆ పోలీస్‌ను పట్టుకుని నిలదీయడంతోపాటు కొట్టారు. వారి నుంచి తప్పించుకున్న అతడు పోలీస్ వ్యాన్‌లో దాక్కున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రాంతంలోని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద మంగళవారం విధుల్లో ఉన్న ఏఎస్ఐ షేర్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. డ్యూటీలో ఉండగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఒక బాలికను అసభ్యకరంగా తాకాడు.
కాగా, బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని పట్టుకుని కొట్టి నిలదీశారు. జనం బారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగుతీసిన ఆ పోలీస్ అధికారి చివరకు పోలీస్ వ్యానులోకి ఎక్కి కూర్చొన్నాడు. స్థానికులను అసభ్యంగా తిట్టడంతోపాటు వారి అంతుచూస్తానని బెదిరించాడు.
మరోవైపు ఆ ప్రాంతంలో గందరగోళం జరుగుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఏఎస్ఐ షేర్ సింగ్ మద్యం సేవించి ఉండటాన్ని గమనించారు. ఆ మత్తులో ఒక బాలిక పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆ పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్థానికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पुलिसवाले पर लगा छात्रा से छेड़छाड़ का आरोप, गुस्साए लोगों ने पुलिसकर्मी को सड़क पर दौड़ाकर पीटा. पटना की घटना. pic.twitter.com/U9wveVbAhm
— Utkarsh Singh (@UtkarshSingh_) November 22, 2023