పాట్నా : బీహార్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రష్యన్ అమ్మాయిలు, డ్యాన్సర్లు, మద్యంతో విజయోత్సవాలు చేసుకుంటున్నారు! ఓ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం.. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌కు హర్యానా, ఉత్తర ప్రదేశ్ల నుంచి మద్యం వెల్లువలా వస్తున్నది. ఢిల్లీ, కోల్‌కతాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్నారు. ఈవెంట్ మేనేజర్లు యథేచ్ఛగా పార్టీ నైట్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యాన్ని అపరిమితంగా అందిస్తామని వీరు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు మద్యం సేవిస్తూ, మాంసం తింటున్నారని వారు తెలిపారు.
బీజేపీ రాజకీయాల్ని బెంగాల్ అంగీకరించదు ; తృణమూల్ ఎంపీ సాగరిక
న్యూఢిల్లీ: బీజేపీ రాజకీయాల్ని పశ్చిమ బెంగాల్ అంగీకరించదని తృణమూల్ ఎంపీ సాగరికా ఘోష్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ను జయించబోతున్నట్టు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఆమె కొట్టిపారేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకురాలు మమతా బెనర్జీ రాష్ర్టానికి సీఎంగా ఉన్నారని, ఓట్ల కోసం విమానాల్లో తిరిగే నాయకురాలు కాదని అన్నారు. విభజించు..పాలించు అనే బీజేపీ రాజకీయాల్ని బెంగాల్ అంగీకరించదని చెప్పారు. ధన బలాన్ని, అధికార బలాన్ని ప్రయోగించటం, హింసను రేపడం బీజేపీ రాజకీయాలుగా ఆమె ఆరోపించారు.