నేర్చుకున్న దగ్గరే లైసెన్స్

- డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లోనే లైసెన్స్ జారీ!
- కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు
- ఏ సంస్థ అయినా కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు
- దరఖాస్తు చేసుకొన్న 60 రోజుల్లో గుర్తింపు
- వీటిల్లో శిక్షణ పొందినవారికి అక్కడే లైసెన్స్‌లు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు(ఆర్టీవో) వెళ్లనక్కర్లేదు. అక్కడ డ్రైవింగ్ టెస్టులో పాస్ కానక్కర్లేదు. డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చిన ప్రైవేటు సంస్థలే లైసెన్స్‌లు కూడా జారీ చేయనున్నాయి. ప్రభుత్వ అధీకృత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల(డీటీసీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వాహన తయారీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు సంస్థలు డీటీసీలను ఏర్పాటు చేసేందుకు, డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు అనుమతినిచ్చింది. శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రైవేటు సంస్థలు ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొన్న 60 రోజుల్లో వాటికి గుర్తింపు లభిస్తుంది. డీటీసీలను ఏర్పాటు చేసే సంస్థలు, ఎన్జీవోలకు.. కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989లో నిర్దేశించిన మేరకు మౌలిక వసతులు, స్థలం ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఆర్టీవోలకు డీటీసీలు అదనం అని కేంద్రం తెలిపింది.
- డీటీసీలు ప్రతీ ఏట తమ పనితీరు నివేదికను సంబంధిత ఆర్టీవో/డీటీవోకు సమర్పించాలి.
- డీటీసీల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు అందవు. రాష్ర్టాలు ఏదేని పథకం కింద ఆర్థిక సాయం చేయవచ్చు.
- డీటీసీలు తమ సొంత వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసుకోవాలి. శిక్షణ సమయం, కోర్సు వివరాలు, పని చేసే రోజులు, ఫీజు తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

