ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఉపాధ్యాయుడు గుల్షన్ హెల్మెట్ ధరించి కారు నడుపుతున్నారు. వెలుగులోకి వచ్చి న ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 26న హెల్మెట్ ధరించకుండా కారును నడిపినందుకు పోలీసులు తనకు రూ.1,100 జరిమానా వేశారని చెప్పారు. తాను సీట్‌బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఈ చర్య తీసుకున్నారన్నారు. తా ను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని, అందుకే హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తున్నానని తెలిపారు. ఇకపై చలాన్లు పడకుండా జాగ్రత్తపడటం కోసం తాను హెల్మెట్ ధరించి కారును నడుపుతానని చెప్పారు.