న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)లో పనిచేస్తున్న డ్రైవర్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి రహస్య వివరాలను చేరవేశాడనే ఆరోపణలు రావడంతో జవహర్‌లాల్‌నెహ్రూ భవన్లో శుక్రవారం ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఐఎస్ఐకి చెందిన వ్యక్తి అమ్మాయిలా నటించి ఎంఈఏ డ్రైవర్‌ను హనీట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య, సున్నితమైన సమాచారాన్ని అతడు పాకిస్థాన్ గూఢచారికి చేరవేసినట్టు కనుగొన్నారు.