Viral Video: కచోరీల కోసం ఒక రైలు డ్రైవర్ ఏం చేశాడంటే!
జైపూర్: కచోరీల కోసం ట్రైన్ డ్రైవర్ ప్రతి రోజూ ఒక చోట రైలును నిలిపేవాడు. ఒక వ్యక్తి ఆయనకు ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ అల్పాహార ప్యాక్‌ను అందజేసేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో రైల్వే అధికారులు స్పందించారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక ట్రైన్ డ్రైవర్ ప్రతి రోజు ఉదయం 8 గంటల సమయంలో దౌద్పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలును ఆపేవాడు. దీంతో అక్కడి రైల్వే గేట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బందిలో ఒకరు సమీప షాపులో కొనుగోలు చేసిన కచోరీల టిఫిన్‌ను ట్రైన్ డ్రైవర్‌కు అందజేసేవాడు.
అయితే దీని వల్ల ఆ రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లను చాలా సేపు మూసి ఉంచేవారు. దీంతో రైల్వే క్రాసింగ్‌కు ఇరు వైపు జనం, వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. కాగా, రోజూ జరిగే ఈ వ్యవహారాన్ని ఒక వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేశాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రైల్వే మంత్రితోపాటు, రైల్వే అధికారులకు ట్యాగ్ చేశాడు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర కుమార్ దీనిపై స్పందించారు. ఇద్దరు లోకో పైలట్లు, ఇద్దరు గేట్మెన్లు, ఒక ట్రైనీ వ్యక్తిని సస్పెండ్ చేశారు. కాగా, అల్వార్ స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్ఎల్ మీనా కూడా లోకో పైలట్ చర్యను ఖండించారు. ట్రైన్ డ్రైవర్ తన సొంత పనుల కోసం ఇష్టానుసారంగా ఇంజిన్ లేదా రైలును నిలుపకూడదని తెలిపారు. కచోరీల కోసం ఎక్కడపడితే అక్కడ రైలును ఆపడం తప్పని అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
@AshwiniVaishnaw @RailMinIndia @GMNWRailway @DRMJaipur @drm_dli
यह वीडियो एकwhatsappग्रुप के माध्यम से आज ओर अभी देखने को मिला हैक्या यह रेलवे नियमानुसार सही है अगर गलत है तो एक्शन लीजिए और सम्बंधित सभी व्यक्तियों पर कार्यवाही करें
@vishalmrcool @JAGMALSINGH_MON @vasudhoot pic.twitter.com/Tw5dtkozzn— 5vaa_creations (@5vaa_creations) February 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

