న్యూఢిల్లీ : రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగటం మరణ ముప్పును 14 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కాఫీలో పాలు, చక్కెర జోడించటం ప్రయోజనాల్ని తగ్గిస్తుందని కూడా అధ్యయనం పేర్కొన్నది. రోజూ కాఫీ తాగటం వల్ల లభిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలకు.. బహుశా అందులోని బయోయాక్టివ్ సమ్మేళనాలే కారణమని టఫ్ట్స్ వర్సిటీ (యుఎస్)కి చెందిన ఫాంగ్ ఫాంగ్ జాంగ్ చెప్పారు.
‘కాఫీ తీసుకోని వారితో పోల్చితే, తక్కువ స్థాయిలో చక్కెర, సంతృప్త కొవ్వులతో కూడిన బ్లాక్ కాఫీని తీసుకున్న వారిలో మరణ ముప్పు 14 శాతం తగ్గింది. రోజుకు మూడు కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తీసుకోవటంతో అదనపు ప్రయోజనం లేదు’ అని పరిశోధకుల్లో ఒకరైన పీహెచ్డీ విద్యార్థి బింగ్జీ జో చెప్పారు.