Memory Problems | న్యూఢిల్లీ: ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్‌ను కలిపి తాగడం వల్ల జ్ఞాపకశక్తి, అభ్యసన సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని తాజా అధ్యయనం అభిప్రాయపడింది. ఈ సమస్యలు జీవిత కాలం వెంటాడవచ్చని చెప్పింది. 10-19 ఏళ్ల మధ్య వయస్కులు వీటిని తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
ఈ దశలో మెదడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి, వీటి వల్ల నష్టం జరగవచ్చని ఇటలీలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఎలుకలపై జరిపిన ఈ అధ్యయనంలో తేలింది. న్యూరోఫార్మకాలజీ జర్నల్ ఈ నివేదికను ప్రచురించింది. ఈ రెండింటినీ కలిపి తాగిన ఎలుకల్లో మెదడు సంబంధిత కార్యకలాపాలు మొదట పెరిగినప్పటికీ, క్రమంగా క్షీణించాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.