DRI | ముంబయిలో ఓ ప్రయాణికురాలి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రూ.84కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హర్యానా నుంచి ముంబయికి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగులో 11.94 కిలోల పౌడర్‌ను గుర్తించాయి. పౌడర్‌ను పరీక్షించగా.. హెరాయిన్‌గా తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో హెరాయిన్ విలువ రూ.84కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు మహిళా ప్రయాణికురాలితో పాటు మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.