న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ‘స్మార్ట్’ ప్రయోగాన్ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. యుద్ధాల సమయంలో శత్రువుల సబ్ మెరైన్లను కూల్చేసేందుకు వినియోగించే లాంగ్ రేంజ్ సూపర్సానిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పిడో (స్మార్ట్)ను ఒడిశాలోని వీలర్ దీవి నుంచి ప్రయోగించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని టార్పిడో చేధించినట్లు డీఆర్డీవో ప్రకటించింది. ‘స్మార్ట్’.. సాధారణ టార్పిడోల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి లక్ష్యాలను ధ్వంసం చేయగలదని వివరించింది.