ULPGM-V3 missile: డ్రోన్ ద్వార యూఎల్‌పీజీఎం-వీ3 క్షిపణి పరీక్ష.. విజయవంతంగా డీఆర్డీవో ట్రయల్స్
ULPGM-V3 missile: డ్రోన్ ద్వార యూఎల్‌పీజీఎం-వీ3 క్షిపణి పరీక్ష చేపట్టారు. ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్డీవో చెప్పింది. ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ టార్గెట్లను పేల్చారు. కర్నూలు జిల్లాలో ఉన్న డీఆర్డీవో టెస్టింగ్ రేంజ్లో ఈ పరీక్ష చేపట్టారు.
న్యూఢిల్లీ: డీఆర్డీవో కీలక పరీక్ష చేపట్టింది. యూఎల్‌పీజీఎం-వీ3 క్షిపణి(ULPGM-V3 missile)ని విజయవంతంగా టెస్ట్ చేసింది. గగనతలం నుంచి భూమిపై, గగనతలం నుంచి గగనతలంలో ఉన్న టార్గెట్లను ఆ డ్రోన్ మిస్సైల్ ద్వారా పేల్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న డీఆర్డీవో టెస్ట్ రేంజ్ సెంటర్లో పరీక్ష చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. యూఎల్‌పీజీఎం వెపన్ సిస్టమ్‌ను జీసీఎస్ కమాండ్, కంట్రోల్ ద్వారా వినియోగించనున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. జీసీఎస్ టెక్నాలజీతో లాంచ్ ఆపరేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలతో కలిసి డీఆర్డీవో పనిచేసింది. డ్రోన్ ఆధారిత మిస్సైళ్ల అభివృద్ధి, తయారీపై ఆ కంపెనీలు సంయుక్తంగా పనిచేశాయి. బెంగుళూరుకు చెందిన న్యూస్స్పేస్ రీసర్చ్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన యూఏవీలను ఇంటిగ్రేట్ చేసి కొత్త వెపన్‌ను వాడారు.
యూఎల్‌పీజీఎం క్షిపణిని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెవలప్ చేసింది. డీఆర్డీవో, డీఆర్డీఎల్ కూడా ఈ క్షిపణి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాయి. చండీఘడ్‌లోని టర్మినల్ బాలిస్టిక్స్ రీసర్చ్ ల్యాబ్, పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసర్చ్ ల్యాబ్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు, ఇతర పరిశ్రమలతో కలిసి క్షిపణిని అభివృధ్ధి చేశారు. ట్రయల్స్ సక్సెస్ కావడం వల్ల భారీ స్థాయిలో క్షిపణులను ఉత్పత్తి చేయనున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. తాజా పరీక్ష పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవోను ఆయన ప్రశంసించారు. డీఆర్డీవో చైర్మెన్ డాక్టర్ సమిర్ వీ కామత్ ఈ ఘనతతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరీని మెచ్చుకున్నారు.
India just armed its drones with a missile that can kill tanks and shoot down other drones.
DRDO completed final trials of ULPGM-V3 on May 18 and 19 at Kurnool 🇮🇳
One missile. Two modes. Here is what was confirmed 👇
• Air to ground mode, destroyed armoured targets with… pic.twitter.com/drmodMshzC
— Military Observer (@TheMilObserverr) May 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

