న్యూఢిల్లీ: ఇతర సర్వీసులతో సమానంగా తమకు కూడా ప్రభుత్వ పెన్షన్ ఇప్పించాలని 26 ఏండ్ల క్రితం రిటైరైన 136 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు పీకే గణేష్ బాబు మాట్లాడుతూ పదేళ్ల సర్వీసును వదులుకుంటే పెన్షన్‌కు అర్హులవుతామని భావించి 1996-97లో తమ యూనియన్ సభ్యులందరూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందారన్నారు.
ఇదే ర్యాంకులలో పదవీ విరమణ చేసిన ఇతర సర్వీసుల ఉద్యోగులు పెన్షన్ పొందుతుండగా తమకు అన్యాయం జరిగిందన్నారు. అయితే పెన్షన్‌కు బదులుగా తిరిగి విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇచ్చినప్పటికీ ఫిట్నెస్ కారణాల వల్ల తిరిగి ఫోర్స్‌లో చేరలేకపోయామని తమకు న్యాయం చేయాలని కోరారు.