దీప్కే అరెస్ట్‌కు మహిళా పోలీసులే ఎందుకు?
సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను విమానంలో అరెస్ట్ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయిన వెంటనే పూర్తిగా ప్రయాణికులు దిగకుండానే పోలీసులు ఆ విమానంలోకి అడుగుపెట్టారు. ఇది ముందే ఊహించిన దీప్కే దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇచ్చారు. సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను విమానంలో అరెస్ట్ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయిన వెంటనే పూర్తిగా ప్రయాణికులు దిగకుండానే పోలీసులు ఆ విమానంలోకి అడుగుపెట్టారు. ఇది ముందే ఊహించిన దీప్కే దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇచ్చారు. సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఢిల్లీ పోలీసులు ఏమని ఆలోచించారో తెలియదు కానీ, వారి అరెస్ట్‌కు మహిళా పోలీస్ అధికారులను విమానంలోకి పంపారు.
అయితే పోలీసుల ఈ వ్యూహం ఉద్దేశపూర్వకమైనదా లేదా కాకతాళీయమా అన్నది నిర్ధారణ కాలేదు. పురుష పోలీసులను ఉంచితే సీజేపీ నాయకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావచ్చునని, ఇరుకుగా ఉండే విమానంలో ఈ పరిస్థితి ఏర్పడితే అది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొచ్చని పోలీసులు భావించారు. ఈ పరిస్థితులలో చిన్న ఘర్షణ కూడా పెద్ద గందరగోళానికి దారి తీయవచ్చు. ఇటువంటి పరిస్థితిని నివారించడానికి, ఉద్రిక్తత పెరిగే ప్రమాదాన్ని తగ్గించే ఉద్దేశంతో పోలీసులు మహిళా పోలీసులను మోహరించి ఉండవచ్చని భావిస్తున్నారు. కొద్దిపాటి వాదోపవాదాలు మినహా, దీప్కే, ఇతర నాయకులు ఎలాంటి గందరగోళం సృష్టించకపోవడం చూస్తుంటే ఢిల్లీ పోలీసుల వ్యూహం ఫలించినట్టుగానే భావించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

