(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతున్నది. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇచ్చే అంశంపై రాజుకున్న నిప్పు రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మార్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విభజనవాదమే హింసాకాండకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మణిపూర్ హింసాకాండపై ఏబీపీ-సీ ఓటర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది.
ఏబీపీ-సీఓటర్ సర్వే వివరాలు ఇలా…
ప్ర: మణిపూర్లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందా?
విపక్షాలు: అవును (65.2 శాతం)
ఎన్డీయే: అవును (43.4 శాతం)
స్థానికులు: అవును (56.5 శాతం)
ప్ర: మణిపూర్ హింస నేపథ్యంలో సీఎం బీరెన్ రాజీనామా చేయాలా?
విపక్షాలు: అవును (66.5 శాతం)
ఎన్డీయే: అవును (48.4 శాతం)
స్థానికులు: అవును (59.3 శాతం)
ప్ర: మణిపూర్ హింసను ఆపేందుకు ప్రధాని మోదీ ఎప్పుడో చొరవ తీసుకోవాల్సిందా?
విపక్షాలు: అవును (82.7 శాతం)
ఎన్డీయే: అవును (76.3 శాతం)
స్థానికులు: అవును (80.1 శాతం)