లక్నో: ప్రియుడితో కలిసి ఉన్న భార్యను భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తనను హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో ఉంచే అవకాశం ఉన్నందున భార్యతో కలిసి జీవించడం ఇష్టం లేదంటూ హంగామా చేశాడు. (Don’t Want To End Up In A Drum) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మౌరానీపూర్లో నివసించే పవన్ ఆరోగ్యశాఖలో పని చేస్తున్నాడు. అతడి భార్య రీతూ వర్మ ప్రభుత్వ బాలికల కాలేజీలో క్లర్క్‌గా పనిచేస్తున్నది. వారికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్‌తో భార్యకు వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్త పవన్ అదే ప్రాంతంలో విడిగా నివసిస్తున్నాడు. కుమారుడితో కలిసి భార్య రీతూ వర్మ నివసిస్తున్న ఇంట్లో ఆమె ప్రియుడు ఉన్నట్లు అతడు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత కౌన్సిలర్ అభిషేక్ పాఠక్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అక్కడున్న పోలీసులు, ఇతరులతో అతడు దురుసుగా ప్రవర్తించాడు.
మరోవైపు తన భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు, తన కుమారుడికి ప్రాణ ముప్పు ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో ఉంచే అవకాశం ఉన్నందున ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని పోలీసులకు చెప్పాడు. మీరట్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్‌ను అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా కలిసి హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన ఘటనను గుర్తు చేస్తూ ఇలా అన్నాడు. దీంతో పవన్ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Extra-Marital Affair Kalesh (Husband Caught his wife with someone else’s in his own house, The husband could not gather courage to confront his wife’s lover. So he called 112 police) Jhansi UP
pic.twitter.com/lgNnUE8kjV— Ghar Ke Kalesh (@gharkekalesh) April 10, 2025