AI | న్యూఢిల్లీ: నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్ను కొందరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటే…. కొంత మంది దాని వినియోగాన్ని ఒక వ్యసనంగా చేసుకొన్నారు. ఆన్లైన్లోనే చాటింగ్ లేదా వీడియోలు, రీల్స్ స్క్రోలింగ్లతో రోజంతా గడిపేవారు కూడా ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని వల్ల జరిగే అనర్థాలు అనేకం. ప్రస్తుత కృత్రిమ మేధ(ఏఐ) యుగంలో అయితే మానవులు ఏఐ చాట్బాట్లతో కూడా స్నేహం చేయడం, ప్రేమ పెంచుకోవడం వంటి సందర్భాలూ ఉంటున్నాయి.
అయితే ఏఐతో ప్రేమలో పడొద్దని, అది కేవలం నటిస్తుందని, మీ గురించి ఎంతమాత్రం పట్టించుకోదని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ విధమైన సంబంధం మొదట్లో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించొచ్చని, హానికరం కాదని అనిపించొచ్చని, అయితే ప్రజల భావోద్వేగ ఆరోగ్యాన్ని ఏఐ ప్రమాదంలో పడేసే ముప్పు ఉన్నదని ఎంఐటీ సైకాలజిస్టు షెర్రీ తుర్క్లే తన నివేదికలో హెచ్చరించారు. ఏఐ చాట్బాట్లకు నిజమైన సానుభూతి, అనుబంధాలు ఉండవని, మానవ భావోద్వేగాలను ప్రతిబింబించలేవని స్పష్టం చేశారు.