వంటగ్యాస్‌పై మళ్లీ వడ్డన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.75ను పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 884.50కు, వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.1,693కు చేరింది. రాయితీయేతర సిలిండర్‌పై ఎలాంటి పెంపు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.884.50గా ఉన్నది. రాయితీ వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా ఇంతే ఉండటం గమనార్హం. కాగా, తాజా పెంపు బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల విలువ ఆధారంగా పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించాయి. గత రెండు నెలల్లో సిలిండర్ ధరలను మూడుసార్లు పెంచారు. ఇదిలాఉండగా, పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 14 పైసలను తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 101.34, డీజిల్ రూ. 88.77గా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- domestic gas
- gas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

