చండీగఢ్ : వీధి కుక్కలు, ఇతర జంతువుల దాడిలో గాయపడ్డవారికి పరిహారం ఇవ్వాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానిదే అని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పష్టంచేసింది. కుక్కకాటు కేసుల్లో ఒక పన్ను గాటుకు కనీసంగా రూ.10 వేల చొప్పున, మాంసం పీకిన ప్రాంతంలో 0.2 సెంటీమీటర్ల గాయానికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని పేర్కొన్నది.
పరిహారాన్ని సంబంధిత ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి వసూలు చేసే హక్కు కూడా సర్కార్కు ఉంటుందని స్పష్టం చేసింది.