అక్కడ కుక్కల్ని పెంచుకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే..!
ఇప్పటి వరకు మనం ఆదాయపు పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను వంటివి మాత్రమే చూసుంటాం. అయితే, మధ్యప్రదేశ్‌లో మాత్రం అధికారులు కొత్త పన్నును ప్రజలకు పరిచయం చేశారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ విధించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నారు.
Madhya Pradesh | ఇప్పటి వరకు మనం ఆదాయపు పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను వంటివి మాత్రమే చూసుంటాం. అయితే, మధ్యప్రదేశ్‌లో మాత్రం అధికారులు కొత్త పన్నును ప్రజలకు పరిచయం చేశారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ విధించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నారు.
ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నగరంలో కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయని, బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు శునకాలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శునకాలకు రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, కుక్కలను పెంచుకునేవారికి పన్నులు విధిస్తామని వారు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

