ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
Mamata Banerjee: నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతలో మమత పరాజయం మూటగట్టుకుంది.

హైదరాబాద్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబట్టి, మమత బెనర్జి స్వయంగా పోటీకి దిగిన నందిగ్రామ్‌లో మాత్రం ఆమెను ఓడించారు. మొత్తం 294 స్థానాలకుగాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 214 స్థానాల్లో విజయం సాధించింది. కానీ నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతలో మమత పరాజయం మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో మమతాబెనర్జి ముఖ్యమంత్రి పదవి చేపడుతారా.. లేదా..? ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఏ చట్టసభలో సభ్యత్వం లేకపోయినా మమత సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం.. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా మంత్రిగాగానీ, ముఖ్యమంత్రిగానీ కొనసాగవచ్చు.
అయితే, ఈ అవకాశం కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఈ ఆరు నెలలో శాసనసభకుగానీ, శాసనమండలికిగానీ ఎన్నికవ్వాల్సిందే. లేదంటే పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. కాబట్టి మమతాబెనర్జి ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల లోగా ఏదైనా ఒక అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేయించి పోటీ చేసి గెలువవచ్చు.
గతంలోనూ ఇలాంటి పరిణామాలు..!
2011లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించినప్పుడు కూడా మమతాబెనర్జి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. అయినా ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆ తర్వాత భవానీపూర్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు.
అయితే, ఉప ఎన్నికల్లో పోటీచేసి కూడా ఓడిపోతే మాత్రం మమతాబెనర్జి సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కానీ, అలా జరిగే అవకాశం అత్యంత అరుదుగా మాత్రమే ఉంది. ఎందుకంటే అలాంటి ఘటన ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే చోటుచేసుకుంది. 2009లో అప్పటి జార్ఖండ్ సీఎం ఉప ఎన్నికల్లో తమర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
పవన్ సరసన టాలెంటెడ్ నటి..!
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

