న్యూఢిల్లీ: ఒక వ్యక్తి పెద్ద పేగులో నుంచి వైద్యులు బతికి ఉన్న పెద్ద చేపను బయటికి తీశారు. వియత్నాంలోని ఉత్తర క్వాంగ్నిన్హ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి (34)కి ఈ అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను జిల్లా మెడికల్ సెంటర్ వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించారు. శస్త్ర చికిత్స చేసి సుమారు 30 సెంటీమీటర్ల పొడవైన మలుగు చేపను బయటకు తీశారు. మల ద్వారం గుండా కడుపులోకి ప్రవేశించి ఉండవచ్చునని వైద్యులు భావిస్తున్నారు. బయటపడిన తర్వాత కూడా ఈ మలుగు చేప బతికి ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.