న్యూఢిల్లీ, డిసెంబర్ 27: నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) వైద్యులు ఢిల్లీలో సోమవారం చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆరోగ్యశాఖ కార్యాలయం, సుప్రీంకోర్టు వైపునకు వెళ్తున్న నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. సరోజినీ నగర్ పోలీసు స్టేషన్లో 4 వేల మంది వైద్యులను పోలీసులు నిర్బంధించారని ఫోర్డా ఆరోపించింది. డాక్టర్ల నిరసనతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.