భోపాల్: భార్యకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధుడిపై ఒక డాక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ వృద్ధుడ్ని కొట్టడంతోపాటు ఈడ్చుకెళ్లాడు. (Doctor Thrashed Elderly Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌పై చర్యలకు ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 17న 77 ఏళ్ల ఉధవ్లాల్ జోషి తన భార్యకు చికిత్స కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. పెద్ద క్యూ ఉండటంతో పక్కన నిల్చొన్నాడు.
కాగా, రూమ్ ముందు గుంపుగా ఉన్న రోగులపై డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజేష్ మిశ్రా అసహనం వ్యక్తం చేశాడు. తన భార్యకు త్వరగా చికిత్స అందించాలని కోరిన వృద్ధుడు జోషిపై అతడు ఆగ్రహించాడు. వృద్ధుడి చెంపపై కొట్టడంతోపాటు మరో వ్యక్తితో కలిసి ఆసుపత్రి బయటకు ఈడ్చుకెళ్లాడు. తన విధులకు అతడు ఆటంకం కలిగించినట్లు ఆరోపించాడు. అయితే ఆ డాక్టర్ తనపై అకారణంగా దాడి చేసినట్లు ఆ వృద్ధుడు వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్ అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు డాక్టర్ రాజేష్ మిశ్రా ఆ వృద్ధుడ్ని కొట్టి, ఈడ్చుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో హాస్పిటల్ అధికారి డాక్టర్ జీఎల్ అహిర్వార్ ఈ సంఘటనపై స్పందించారు. డాక్టర్ రాజేష్ మిశ్రా ప్రవర్తన సహించరాదని అన్నారు. అంతర్గత దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ డాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
A 75-year-old man was brutally beaten and dragged out of #Chhatarpur District Hospital just for pleading urgent treatment for his ailing wife, as he couldn’t stand in a long queue.@DrMohanYadav51, a govt that can’t respect elders or provide basic healthcare has no right to stay… pic.twitter.com/Sl074TOt5g
— India With Congress (@UWCforYouth) April 20, 2025