Watch: రోగిని కొట్టి, కాళ్లతో తన్నిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్.. వీడియో వైరల్
Doctor Kicks, Thrash Patient | చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రోగి చేతులు పట్టుకుని గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రోగి చేతులు పట్టుకుని గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. (Doctor Kicks, Thrash Patient) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆకాష్ ఉపాధ్యాయ అనే రోగి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యం కోసం డాక్టర్ ఆర్పీ సింగ్‌ను సంప్రదించాడు.
కాగా, చీటీపై రాసిన మందులు బయట కొనుక్కోవాలని డాక్టర్ ఆర్పీ సింగ్ చెప్పాడు. రోగి ఆకాష్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మందులు బయట కొనమని డాక్టర్ చెప్పడాన్ని అతడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన డాక్టర్ ఆర్పీ సింగ్ తన కుర్చీ నుంచి లేచి వచ్చాడు. రోగి ఆకాష్‌ను కొట్టాడు. అతడ్ని కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లాడు.
మరోవైపు డాక్టర్ రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు రోగిని కొట్టిన డాక్టర్ ఆర్పీ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని రోగి తనను డిమాండ్ చేసినట్లు ఆ డాక్టర్ ఆరోపించాడు.
यूपी में महोबा के जिला अस्पताल में डॉक्टर RP सिंह ने आकाश उपाध्याय नामक मरीज को लात-घूसों से पीटा और घसीटते हुए चैंबर के बाहर ले गए।
मरीज का आरोप- डॉक्टर ने बाहर की दवाई लिखीं, इसका विरोध करने पर पिटाई हुई।
डॉक्टर बोले- शराब पीने के लिए 200 रुपए मांग रहा था। इसका मैंने विरोध… pic.twitter.com/dec3suSmu0— Sachin Gupta (@Sachingupta) March 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

