కారును ఆపి.. డాక్టర్ దంపతుల్ని కాల్చి చంపేశారు

భరత్‌పుర్ : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై ఇద్దరు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన భార్య మరణించారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో జరిగింది. నగరంలోని బిజీ క్రాసింగ్ వద్ద ఈ కాల్పుల ఘటన జరగడం శోచనీయం. సాయంత్రం 4.45 నిమిషాలకు సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రాసింగ్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. కారుకు అడ్డంగా నిలిచారు. అయితే డ్రైవర్ సీటులో ఉన్న డాక్టర్.. కారు విండో తీస్తుండగానే.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. పలు రౌండ్లు కాల్పులు జరిపి.. బైక్‌పై పరారీ అయ్యారు. ప్రతీకారంతోనే ఆ డాక్టర్ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డాక్టర్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్న ఆ యువతిని హత్య చేశారు. డాక్టర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఆ యువతి సోదరుడిలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆమె తల్లి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

