China Mobiles | డ్రాగన్ మొబైల్ ఫోన్లు వాడొద్దు.. జవాన్లకు నిఘా వర్గాల హెచ్చరికలు!
China Mobile Phones | మాల్వేర్, స్పైవేర్ ఉన్నందున చైనా మొబైల్ ఫోన్లను సైనికులు వాడొద్దని రక్షణశాఖకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
China Mobiles | సైనికులు చైనా మొబైల్ ఫోన్లు వాడకుండా చర్యలు తీసుకోవాలని రక్షణశాఖ అధికారులకు నిఘా వర్గాలు సూచించాయి. ఇటీవల కొంతకాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. దీనిపై ఇరు దేశాల సైన్యాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో చైనా మొబైల్ ఫోన్లు వాడొద్దని రక్షణ శాఖ అధికారులకు నిఘా వర్గాలు సూచించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. చైనా మొబైల్ ఫోన్ల నుంచి మాల్వేర్, స్పైవేర్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాలు రక్షణశాఖను హెచ్చరించాయి. చైనా మొబైల్ ఫోన్లు వాడుతున్న వారు ఇతర ఫోన్లు వాడాలని సైనిక సిబ్బందికి సూచించాయి.
చైనా మొబైల్ ఫోన్ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సైనిక సిబ్బందిని ఆదేశించాలని రక్షణశాఖ నిఘా వర్గాలు సర్క్యులర్ విడుదల చేశాయి. భారత్తో విభేదిస్తున్న దేశాల్లో తయారైన మొబైల్ ఫోన్లను సైనికులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వాడకుండా జాగ్రత్త వహించాలని ఆ సర్క్యులర్ పేర్కొంది. కొన్ని చైనా మొబైల్ ఫోన్లలో మాల్వేర్, స్పైవేర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
అయితే, చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు తయారు చేసిన పలు మొబైల్ ఫోన్లో దేశీయ మార్కెట్లో లభిస్తున్నాయి. గతంలో పలు చైనా యాప్స్ను కేంద్రం నిషేధించింది. ఆయా ఫోన్లలో సైనికులు వాడుతున్న చైనా యాప్లను రక్షణశాఖ నిఘా వర్గాలు తొలగించాయి. దేశభద్రతకు ముప్పు ఉన్నందునే పలు చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

