Veep Candidate | వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67)ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్టు కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఆదివారం వెల్లడించింది.
అయితే, విపక్ష ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ విపక్ష కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందని డీఎంకే (DMK) పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ (Rajya Sabha MP) తిరుచ్చి శివ (Tiruchi Shiva) పేరును ఆ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం డీఎంకే కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
దీంతో రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ‘ఇండియా’ కూటమి ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని విపక్ష కూటమి భావిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read..
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్.. ఎన్డీయే తరఫున బరిలోకి
Landslides | కులులో వర్ష బీభత్సం.. భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో
Morning Walk | షాకింగ్.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళల్ని ఢీ కొట్టిన రైలు