న్యూఢిల్లీ: తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తున్నదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్(Dharmendra Pradhan) తెలిపారు. లోక్‌సభలో ఇవాళ ఓ ప్రశ్నకు బదులిస్తూ.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు అంశంలో దేశాన్ని డీఎంకే తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. త్రీ లాంగ్వేజ్ పాలసీని తమిళనాడు వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని, తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తోందన్నారు. డీఎంకే అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు.
మంత్రి ధర్మేంద్ర వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొన్నది. డీఎంకే ఎంపీలు సభలో నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పీఎం శ్రీ స్కీమ్‌పై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. కేంద్ర స్కీమ్‌ను అమలు చేసే అంశంలో డీఎంకే నేతృత్వంలోని తమినాడుళ సర్కారు యూ టర్న్ తీసుకున్నట్లు చెప్పారు. ఎన్ఈపీ స్కీమ్‌పై ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రాష్ట్రానికి నిధులు మంజూరీ అవుతాయన్నారు. అయితే తొలుత ఆ ఒప్పందం కుదుర్చుకునేందుకు తమిళనాడు సర్కారు సిద్దమైందని, కానీ ఇప్పుడు ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుందని తెలిపారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లాంటి బీజేపీ యేతర రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. పీఎం శ్రీ స్కీమ్ కింద ఒప్పందం కుదుర్చుకోవడానికి తమిళనాడు వద్ద ఇంకా 20 రోజుల సమయం ఉందన్నారు.
మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ.. డీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ డీఎంకే ఎంపీలు అభ్యర్థనను తోసిపుచ్చాయి. ఒకవేళ పది వేల కోట్లు ఇచ్చినా.. ఎన్ఈపీ అమలు చేయబోమని ఇటీవల సీఎం స్పష్టం చేశారు. కేవలం హిందీ భాష అమీలును వ్యతిరేకించడం లేదని, విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడవద్దని తెలిపారు. పీఎం శ్రీ స్కీం కోసం అయిదేళ్ల వరకు 27 వేల కోట్ల నిధుల కేటాయించారు. దీంట్లో కేంద్రం వాటా 18 వేల కోట్లు. 32 రాష్ట్రాలు, యూటీలకు చెందిన 12 వేల స్కూళ్లకు ఆ నిధుల్ని ఖర్చు చేయనున్నారు.
#WATCH | Delhi: DMK MP Kanimozhi Karunanidhi says, ” DMK MP raised the issue where Union govt has not released funds for Tamil Nadu saying that unless state govt agrees to sign the NEP, the 3-language policy, funds more than Rs 2000 crores won’t be released for the schools. The… pic.twitter.com/cAR4WuZIOY
— ANI (@ANI) March 10, 2025