చెన్నై: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రం మధ్య ‘హిందీ’పై మరో వివాదం తలెత్తింది. కేంద్ర మంత్రి హిందీలో పంపిన లేఖలోని ఒక్క మాట కూడా తనకు అర్థం కాలేదని డీఎంకే ఎంపీ విమర్శించారు. (DMK MP MM Abdulla) ఈ మేరకు తమిళంలో కేంద్ర మంత్రికి బదులిచ్చారు. తాను అడిగిన ప్రశ్నకు ఇంగ్లీష్‌లో సమాధానం ఇవ్వాలని కోరారు. డీఎంకే రాజ్యసభ ఎంపీ పుదుక్కొట్టై ఎంఎం అబ్దుల్లా , రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన ప్రశ్న అడిగారు. రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ దీనికి హిందీలో సమాధానం పంపారు.
కాగా, కేంద్ర మంత్రి బిట్టూ తనకు పంపిన హిందీ లేఖలోని ఒక్క మాట కూడా అర్థం కాలేదని డీఎంకే ఎంపీ అబ్దుల్లా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రశ్నకు సమాధానం ఆంగ్లంలో పంపాలని కోరారు. ఈ మేరకు తమిళంలో లేఖ రాశారు. ఈ రెండు లేఖలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. తనకు హిందీ అర్థం కాదన్న విషయాన్ని కేంద్ర మంత్రి కార్యాలయం అధికారులకు అనేక సార్లు చెప్పినట్లు అందులో తెలిపారు.
అయినప్పటికీ హిందీలోనే కమ్యూనికేషన్లు పంపుతున్నారని అబ్దుల్లా విమర్శించారు. ‘రైల్వే శాఖ సహాయ మంత్రి కార్యాలయం నుంచి అందే లేఖలు ఎప్పుడూ హిందీలో ఉంటాయి. ఆయన కార్యాలయం అధికారులకు నేను ఫోన్ చేశా. నాకు హిందీ రాదని, దయచేసి లేఖను ఆంగ్లంలో పంపాలని కోరా. అయినప్పటికీ లేఖ హిందీలో ఉంది. అందుకే కేంద్ర మంత్రి అర్థం చేసుకుని వ్యవహరించడం కోసం తమిళంలో ప్రత్యుత్తరం పంపా’ అని పేర్కొన్నారు.
Dmk Mp Mm Abdulla Letter