చెన్నై: ప్రతిజ్ఞ సందర్భంగా మహిళ చేతికి ఉన్న గాజును దొంగిలించేందుకు ఒక నేత ప్రయత్నించాడు. (DMK member trying to steal bangle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కూనూర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని డీఎంకే సభ్యులు హిందీకి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 25వ వార్డు డీఎంకే కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె చేతికి ఉన్న గాజు బయటకు తీసేందుకు, చోరీకి ప్రయత్నించాడు. గమనించిన ఆ కౌన్సిలర్ పక్కన ఉన్న సభ్యురాలు పలుమార్లు అతడ్ని వారించింది.
కాగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. అధికార డీఎంకే పార్టీపై ఆయన మండిపడ్డారు. ‘కూనూర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని 25వ వార్డు డీఎంకే కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, హిందీ వ్యతిరేకత ముసుగులో గాజు దొంగిలించారు. దొంగలను, డీఎంకేను ఎప్పటికీ వేరు చేయలేం’ అని ఆరోపించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ సాంస్కృతి, మతపరమైన అంశాలను ద్రవిడ ఉద్యమం దొంగిలించిందని ఒకరు విమర్శించారు. ‘ద్రవిడులు దొంగలు. హిందూ దేవాలయాలు, సంగీతం, నృత్యం, సాహిత్యం ద్రావిడ కళగా మారాయి. తిరువల్లువ నాయనార్ను కూడా దొంగిలించారు. మతేతర పండుగగా పొంగల్ మారింది’ అని ఒకరు ఆరోపించారు.
కాగా, డీఎంకేలో నైతికత లోపించిందని, ఆ పార్టీ నేతలు అవినీతిపరులని మరొకరు విమర్శించారు. మిగతా పార్టీల నేతలు పది శాతం మాత్రమే మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తే, డీఎంకేలో 90 శాతం మంది ఇలా దారుణంగా ప్రవర్తిస్తారని ఆరోపించారు. పార్టీ సభ్యురాలి పట్ల ఆ నేత అనుచితంగా ప్రవర్తించడంపై డీఎంకే ఎంపీ కనిమొళిని ఒకరు ప్రశ్నించారు. ‘మహిళల చేతులతో ఆడుకునే వారి చేతులు నరకాలి. ఎలాంటి భయం లేకుండా బహిరంగంగా స్త్రీ చేయి పట్టుకునే ధైర్యం అతడికి ఎలా వచ్చింది?’ అని మండిపడ్డారు.
இந்தி எதிர்ப்புப் போர்வையில், வளையலைத் திருடும் குன்னூர் நகர்மன்ற 25-வது வார்டு திமுக கவுன்சிலர் திரு ஜாகிர் உசேன்.
திருட்டையும் திமுகவையும் எப்போதும் பிரிக்கவே முடியாது! pic.twitter.com/1wQKadFcnY
— K.Annamalai (@annamalai_k) March 4, 2025