న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ టీఆర్ బాలు(MP TR Baalu) ఇవాళ లోక్సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి మురుగన్ అసమర్థ ఎంపీ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు వరదలకు సంబంధించిన ప్రశ్నపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ టీఆర్ బాలు మాట్లాడారు. అయితే ఆయన వేసిన సప్లమెంటరీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ సంబంధం లేని ప్రశ్న వేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మంత్రికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయినా కానీ బాలూ తన వ్యాఖ్యలను ఉపసంహరించలేదు. దళిత మంత్రిని అవమానించినట్లు బీజేపీ ఆరోపించింది. చివరకు స్పీకర్ ఓం బిర్లా ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించారు. డీఎంకేతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఎంపీ బాలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నేతలు సభలో నినాదాలు చేశారు. మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర మంత్రులు కూడా నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మురుగన్ ఓ దళితుడు అని, బాలు వ్యాఖ్యలు యావత్ దళిత సంఘాన్ని అవమానించినట్లు అవుతుందన్నారు.
மக்களவையில் மத்திய இணை அமைச்சரை அவமதித்து திமுக எம்.பி. டி.ஆர். பாலு பேசியதால் ஏற்பட்ட அமளி….#Loksabha | #TRBaalu | #DMK | # pic.twitter.com/CwJTIZ8EtV
— Only Truth (@OnlyTruth2024) February 6, 2024