DMK: కేంద్ర మంత్రిపై ఈసీకి ఫిర్యాదు చేసిన డీఎంకే
DMK: కేంద్ర మంత్రి శోభపై డీఎంకే ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు వెనుక తమిళ ప్రజలు ఉన్నట్లు మంత్రి ఆరోపించారు.
చెన్నై: బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు తమిళనాడు వ్యక్తికి సంబంధం ఉన్నట్లు కేంద్ర మంత్రి శోభ కరండలేజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను డీఎంకే(DMK) ఖండించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వద్ద డీఎంకే ఫిర్యాదు చేసింది. తమిళ ప్రజల్ని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారని మంత్రిపై డీఎంకే ఆరోపించింది. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, రెండు రాష్ట్రాల ప్రజల్ని బీజేపీ అవమానిస్తుందని, ఆ రాష్ట్రాల ప్రజల్ని రెచ్చగొడుతోందని డీఎంకే పేర్కొన్నది.
తన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి శోభా కరండలేజ్(Shobha Karandlaje) తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు పాల్పడింది కృష్ణగిరి ఫారెస్ట్‌లో శిక్షణ పొందిన వ్యక్తి అని మంత్రి శోభ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆమె ఆ ట్వీట్ చేశారు. తమిళ సోదరసోదరీమణులకు ఓ విషయాన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నామని, తాను సదుద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశామనని, కానీ ఆ వ్యాఖ్యలు కొందరికి బాధను కలిగించాయని, రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌తో లింకున్న వ్యక్తి కృష్ణగిరి ఫారెస్ట్‌లో శిక్షణ పొందినట్లు ఆమె వ్యాఖ్యానించారు.
இரு மாநிலங்களுக்கு இடையே கலவரத்தை தூண்டும் வகையிலும், தமிழ்நாட்டு மக்களை இழிவுப்படுத்தியும் பேசிய ஒன்றிய அமைச்சர் ஷோபா மற்றும் பாஜக மீது நடவடிக்கை மேற்கொள்ளுமாறு இந்திய தேர்தல் ஆணையத்தில் கழக அமைப்புச் செயலாளர் திரு @RSBharathiDMK அவர்கள் புகார்! pic.twitter.com/XZObRlkxEA
— DMK (@arivalayam) March 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP Minister
- DMK
- EC
- extremists
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

