చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై శనివారం మరోమారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. టీవీకే ప్రభుత్వం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. విజయ్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ బీజేపీకి జిరాక్స్ కాపీ మాదిరిగా పనిచేస్తున్నదన్నారు.
అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే మహిళా వింగ్ సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఆయనకు సొంత పార్టీ కేడర్‌పై నమ్మకం లేదని, ఇతర రాష్ర్టాల్లోని బీజేపీ చేస్తున్న పనులనే విజయ్ ఇక్కడ చేస్తున్నారన్నారు.