బెంగళూర్ : కర్నాటక (Karnataka Polls) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 224 అసెంబ్లీ స్ధానాలకు గాను ఏకంగా 141 స్ధానాల్లో గెలుపొందుతుందని ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కర్నాటక ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్ధితి నెలకొంటే జేడీ(ఎస్)తో కలుస్తారా అని ప్రశ్నించగా అలాంటి పరిస్ధితి రాదని, తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ 166 మంది అభ్యర్ధులను ప్రకటించింది. అభ్యర్ధుల ఎంపికలో పార్టీ మొత్తం ఏకాభిప్రాయంతో వ్యవహరించిందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
అభ్యర్ధుల ఎంపికలో డీకే సిద్ధరామయ్య వర్గీయులతో తన వర్గానికి విభేదాలు తలెత్తాయనే ప్రచారం సరికాదని, దీటైన కాంగ్రెస్ అభ్యర్ధులనే తాము కోరుకున్నామని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఇక డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మే 20న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Read More
Prakash Raj | సుదీప్ నిర్ణయంతో చాలా బాధపడ్డా : ప్రకాశ్ రాజ్