న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సొంత పార్టీ మహిళా కార్యకర్తల పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దురుసుగా వ్యవహరించారు. బెలగావిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మహిళా కార్యకర్తలను శివకుమార్ పక్కకు తోసేయడం వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డీకే ప్రవర్తనను ప్రతిపక్ష బీజేపీ తప్పుబట్టింది. వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో షేర్ చేస్తూ ‘మహిళా సాధికారితపై కాంగ్రెస్ వైఖరి ఇది’ అంటూ వ్యాఖ్యానించారు. వారేమన్నా పశువులనుకుంటున్నారా? అలా తోసేస్తున్నారు. నిజంగా సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.