బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో కినుక వహించిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది కాంగ్రెస్ పార్టీలో చేరారు. లక్ష్మణ్ సవది కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో ఉంటారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ శుక్రవారం ప్రకటించారు.
కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా, మాజీ సీఎం సిద్ధరామయ్యలతో భేటీ అనంతరం లక్ష్మణ్ సవది కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారని డీకే శివకుమార్ వెల్లడించారు. లక్ష్మణ్ సవదిని తాము కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకున్నారని అన్నారు. లక్ష్మణ్ సవదిని బీజేపీ సరైన రీతిలో గౌరవించలేదని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
బీజేపీలో తనను చిన్నచూపు చూశారని లక్ష్మణ్ సవది ఆవేదన చెందారని చెప్పారు. అధాని స్ధానం నుంచి కాంగ్రెస్ తరపున ఆయన బరిలో నిలుస్తారని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More