చెన్నై: జనాభా ప్రాతిపదికన జరిగే ప్రతిపాదిత డీలిమిటేషన్ వల్ల ఫెడరల్ ప్రజాస్వామ్యానికి ముప్పని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ సమావేశంలో డీకే ప్రసంగిస్తూ జనాభా పెరుగుదలను నియంత్రించి, అక్షరాస్యతను మెరుగుపరిచి, మహిళలకు సాధికారత సమకూర్చిన దక్షిణాది రాష్ర్టాలపై రాజకీయ దాడిగా డీలిమిటేషన్ ప్రక్రియను అభివర్ణించారు.
మన ప్రజాస్వామ్యానికి పునాదైన ఫెడరలిజం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. జనాభా ప్రాతిపదికన నిర్వహించే డీలిమిటేషన్ వల్ల మనం శక్తిహీనులమవుతామని, ఈ దేశంలో మన మాటకు ఇక విలువ ఉండదని డీకే అన్నారు.