లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు .. బాలీవుడ్ నటి దిశా పఠానీ తండ్రి జగదీశ్ సింగ్ పఠానీ థ్యాంక్స్ తెలిపారు. బరేలీలో ఉన్న దిశా పఠానీ పూర్వీకుల ఇంటిపై కొన్ని రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఇద్దర్నీ బుధవారం ఘాజియాబాద్‌లో ఎన్కౌంటర్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్ స్పందిస్తూ.. నా తరపున, మా కుటుంబం తరపున సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు థ్యాంక్స్ చెబుతున్నానని, తనకు వాగ్దానం చేశారని, క్రిమినల్స్‌ను పట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నారని, సీఎంతో టెలిఫోన్లో సంభాషించానని, ఆయన నేతృత్వంలో యూపీ సర్కారు, యూపీ పోలీసులు భయరహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దిశా పఠానీ తండ్రి జగదీశ్ పఠానీ ఓ రిటైర్డ్ డీఎస్పీ.
పఠానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు మతపరమైన వ్యక్తుల గురించి దిశా,ఆమె సోదరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే నిందితులు రవీంద్ర, అరుణ్‌లను ఎన్కౌంటర్లో షూట్ చేశారు.
#WATCH | Bareilly, UP: Regarding the encounter of the 2 accused of firing outside his residence, actor Disha Patani’s father and retired CO Jagdish Patani says, “I thank UP CM Yogi Adityanath on behalf of me and my family. As he had assured me, he found the criminals and took… pic.twitter.com/ugGXLqY46a
— ANI (@ANI) September 18, 2025