న్యూఢిల్లీ: దివ్యాంగులకు గతంలో కన్నా ఈసారి స్పల్పంగా బడ్జెట్ పెంచారు. వికలాంగుల సాధికారిత విభా గం (డీఈపీడబ్ల్యూడీ)కు ఈ బడ్జెట్లో 1,225.27 కోట్లను కేటాయించారు. గతంలో కేటాయించిన 1,225.01 కోట్ల కన్నా అతి స్వల్పంగా 0.02 శాతం మాత్రమే అధికం.
కేంద్ర నిధుల కేటాయింపుపై వికలాంగ హక్కుల సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒక పక్క సమ్మిళిత వృద్ధని ప్ర భుత్వం పేర్కొంటునప్పటికీ దివ్యాంగులు నిరంతరాయంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నాయి.
దివ్యాంగ హ క్కుల సంస్థలు డిమాండ్ చేసిన దానికన్నా బడ్జెట్లో కేటాయించినది 5% తక్కువని నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద డిజేబుల్డ్ (ఎన్సీఆర్డీ) కార్యదర్శి మురళీధరన్ తెలిపారు. అలాగే దివ్యాంగుల విద్య, పునరావాస కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాతీయ సంస్థలు, రిహాబిలేషన్ కౌన్సిల్ లాంటి స్వతంత సంస్థలకు మద్దతును తగ్గించారని అన్నారు. దివ్యాంగ విద్యార్థుల స్కాలర్షిప్లను కూడా తగ్గించారని, దీంతో డ్రాపౌట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.