Digvijaya Singh : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌లో 26 మంది చిన్నారుల ప్రాణాలు బలిగొన్న కోల్డ్రిఫ్ (Coldrif) దగ్గు మందు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. ఫార్మా కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి రూ.945 కోట్లు ముట్టాయని ఆయన ఆరోపించారు. శనివారం భోపాల్‌లో మీడియా సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు నిధులు సమకూర్చిన ఫార్మా కంపెనీలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
‘విషపూరితమైన మందులను అమ్మే ఫార్మా కంపెనీలకు అన్నివిధాలా రక్షణ ఉంది. ఎందుకంటే అవి కేంద్రంలోని బీజేపీకి భారీ మొత్తంలో ఎన్నికల ఫండ్ చెల్లిస్తున్నాయి. ఈ కంపెనీలు బీజేపీకి రూ.945 కోట్లను ఎలక్టోరల్ బాండ్స్‌గా సమర్పించాయి. వీటిలోని 35 కంపెనీలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు.
𝐁𝐉𝐏 𝐠𝐨𝐭 𝐑𝐬 𝟗𝟒𝟓 𝐜𝐫𝐨𝐫𝐞 𝐟𝐫𝐨𝐦 𝐩𝐡𝐚𝐫𝐦𝐚 𝐟𝐢𝐫𝐦𝐬: 𝐃𝐢𝐠𝐯𝐢𝐣𝐚𝐲𝐚 𝐒𝐢𝐧𝐠𝐡’𝐬 𝐜𝐥𝐚𝐢𝐦 𝐚𝐦𝐢𝐝 𝐂𝐨𝐥𝐝𝐫𝐢𝐟 𝐫𝐨𝐰
Senior Congress leader Digvijaya Singh on Saturday claimed that the BJP received electoral bonds worth Rs 945 crore from… pic.twitter.com/dK3IGoVydL
— IndiaToday (@IndiaToday) October 25, 2025
ఇటీవల మధ్యప్రదేలో కోల్డ్రిఫ్ దగ్గు మందు వికటించి 26 మంది చిన్నారులు చనిపోయినా ఆరోగ్య శాఖ మంత్రి ఇంకా పదవిలోనే ఉన్నారు. కోల్డ్రిఫ్ సిరప్‌పై దర్యాప్తు జరిపిన బృందం.. అందులో హానికరమైన రసాయనాలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికైనా సదరు ఫార్మా కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. చిన్నారుల పాలిట విషంగా మారిన కోల్డ్రిఫ్ సిరప్ తయారీ, అమ్మకాలపై మధ్యప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే.