Digital Arrest | న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతున్నది. ఒక్క 2024 ఏడాదిలో భారతీయులు సుమారుగా రూ.2 వేల కోట్లు నష్టపోయారని ‘నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్సీఆర్పీ) నివేదిక పేర్కొన్నది. 2025లో మొదటి రెండు నెలల్లో 17,718 కేసులు నమోదుకాగా, బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.210 కోట్లు కొల్లగొట్టారని తెలిసింది. డిజిటల్ అరెస్టు స్కామ్ కేసులు.. గత మూడేండ్లలో భారీగా పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య మూడు రెట్లు, బాధితులు కోల్పోయిన సొమ్ము 20 రెట్లు పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి.