COP26 | తొమ్మిదేండ్లలో 45శాతం ఉద్గారాలు తగ్గించాలి.. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటేరస్
COP26 | మానవాళి మనుగడ కోసం కర్బన ఉద్గారాలను నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఐరాస చీఫ్ గుటేరస్ పిలుపునిచ్చారు.

COP26 | మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నామని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ పేర్కొన్నారు. పర్యావరణం నుంచి భూమిని కాపాడుకోవడానికి వాతావరణ సదస్సు (COP26) తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం బ్రిటన్లోని గ్లాస్కోలో కాప్ వాతావరణ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన జీవ వైవిధ్య నాశనం చాలు అని చెప్పారు. కర్బన ఉద్గారాలతో మన ప్రాణాలు మనమే తీసుకోవడం నిలిపివేద్దామన్నారు. మరింత లోటుగా గనులు తవ్వి మండించడంతో మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నామని అంటోనియో గుటేరస్ చెప్పారు.
భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కకుండా నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు దేశాలన్నీ కృషి చేయాలని చెప్పారు. వచ్చే తొమ్మిదేండ్లలో కర్బన ఉదర్గాలను 45 శాతం తగ్గించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12 వరకు భూతాప నివారణకు జరిగే వాతావరణ సదస్సులో వాతావరణ మార్పులను నివారించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

