న్యూఢిల్లీ: రోజుకో డైట్ సోడా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు 38 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. సాధారణ తీపి పానీయాల కంటే కృత్రిమ తీపి పదార్థాలు ఉపయోగించి తయారుచేసే శీతల పానీయాలతో మధుమేహ ముప్పు 23 శాతం ఎక్కువని కూడా పేర్కొంది.
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 36 వేల మంది పెద్దలపై 14 సంవత్సరాలపాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.