West Bengal | అటు ఈడీ సమన్లు.. ఇటు పార్టీ ఫిరాయింపు.. రెబల్ క్యాంప్‌లో చేరిన దీదీ సన్నిహితుడు మదన్ మిత్ర
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తునిగా పేరొందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మదన్ మిత్ర బుధవారం పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేసి, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రెబల్ వర్గంలో చేరారు.
- రెబల్ క్యాంప్‌లో చేరిన దీదీ సన్నిహితుడు మదన్ మిత్ర
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తునిగా పేరొందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మదన్ మిత్ర బుధవారం పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేసి, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రెబల్ వర్గంలో చేరారు. మున్సిపల్ నియామకాల కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మదన్ మిత్ర భార్య, ఇద్దరు కుమారులకు నమన్లు జారీ చేసిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా మదన్ మిత్ర మాట్లాడుతూ పార్టీ పతనానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీనే కారణమని విమర్శించారు. ‘పార్టీని కాపాడటం కంటే అభిషేక్‌ను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ అందరిది. కానీ ఇప్పుడు అది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అయ్యింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

