తిరువనంతపురం: సీపీఎం సమావేశంలో పాల్గొన్న నాయకురాలు బీర్ బాటిల్లో ఉన్న ద్రవాన్ని తాగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Chintha Jerome) దీంతో ఆ నాయకురాలు బీరు తాగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై ఆమె స్పందించింది. తాను సైబర్ బెదిరింపులకు గురైనట్లు ఆరోపించింది. కేరళలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) పార్టీ ఇటీవల కొల్లాం జిల్లాలో సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలైన చింతా జెరోమ్ ఇందులో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె టేబుల్ వద్ద బీర్ బాటిల్ వంటిది ఉన్నది. సమావేశం మధ్యలో ఆ బాటిల్లోని ద్రవాన్ని ఆమె తాగింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సీపీఎం నాయకురాలు చింతా జెరోమ్ పార్టీ సమావేశంలో బీరు తాగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వెల్లువెత్తిన ప్రతిపక్షాల విమర్శలపై ఆమె స్పందించారు. హెర్బల్ డ్రింకింగ్ వాటర్ బాటిల్‌ను బీర్‌గా భావించిన వారి మానసిక స్థితిని ప్రశ్నించాలని మండిపడ్డారు. ఈ ఆరోపణలు పచ్చి రాజకీయాలకు నిదర్శమని విమర్శించారు.
మరోవైపు సీపీఎం సదస్సులు గ్రీన్ ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉంటాయని చింతా జెరోమ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ బాటిల్ వాటర్ స్థానంలో రీయూజబుల్ బాటిళ్లలో నింపిన కరుంగళి (హెర్బల్) తాగు నీటిని సమావేశంలో పాల్గొన్న వారికి సరఫరా చేశారని వివరించారు. అయితే వామపక్ష విద్రోహులు బీరు బాటిల్ లాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అంధత్వంతో బాధపడుతున్న వామపక్ష ప్రత్యర్థుల మానసిక స్థితిని పరీక్షించాలని ఆమె అన్నారు.