న్యూఢిల్లీ : డైట్ పాటిస్తూ ఇష్టమైన ఫుడ్‌ను లాగించకుండా నియంత్రించుకోవడం కష్టమైన పనే. అయితే ఓ దేశీ మహిళ డైట్లో ఉన్న తన కొడుకుతో పకోడాలు తినిపించేందుకు ఒప్పించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నీనా కపూర్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో కుటుంబసభ్యుల కోసం నీనా పకోడీలు సిద్ధం చేస్తూ కనిపిస్తుంది.
వీడియోలో కనిపించని ఆమె కుమారుడు మమ్మీ..నేను జిమ్‌కు వెళుతున్నానని ఇప్పుడే చెప్పా కదా..నీవేమో ఇష్టమైన ఆహారం కుక్ చేసేందుకు సిద్ధమయ్యావ్ అని అనడం వినిపిస్తుంది. దీనికి నీనా బదులిస్తూ నేనెప్పుడూ మంచి ఫుడ్‌నే ప్రిపేర్ చేస్తా అంటుంది. నీ వయసులో ఏదైనా తినవచ్చని, తన వయసు వచ్చిన తర్వాత ఏమీ తినలేరని కొడుకును పకోడీలు తినాలని నచ్చచెపుతుంది.
తినేసి ఆపై వ్యాయామం చేయాలని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఆరు లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. మీరు సరిగ్గా చెప్పారు ఆంటీ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇది తల్లి షరుతులు లేని ప్రేమకు సంకేతమని మరో యూజర్ రాసుకొచ్చారు.