న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో ఓ వ్యక్తి మాధురి దీక్షిత్, అమీర్ ఖాన్లు ఆడిపాడిన సారే లడ్కోంకి కర్దో షాదీ అనే పాటకు హుషారైన స్టెప్స్‌తో అలరించాడు. 1990లో విడుదలైన దీవానా ముజే సనహి మూవీలోని ఈ పాటకు అతడి మూమెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంది.
वाह अंकल ने क्या Dance किया है 😁👏🔥 pic.twitter.com/cME7U9slhm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 24, 2022
దేశీ వ్యక్తి కిల్లర్ మూమెంట్స్‌తో అదరగొట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యాన్స్ ఫ్లోర్‌పై అతడి పెర్ఫామెన్స్ సాగుతుండగా చుట్టూ చేరిన వారంతా చప్పట్లతో ప్రోత్సహించడం ఈ క్లిప్‌లో కనిపిస్తోంది. ఆయన డ్యాన్స్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో కితాబిచ్చారు.
అంకుల్ అద్భుతమైన డ్యాన్స్‌తో హోరెత్తించాడని ఓ యూజర్ వ్యాఖ్యానించగా మంచి ఈజ్‌తో సొగసైన స్టెప్స్‌తో అలరించాడని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 5,000కుపైగా వ్యూస్ లభించాయి.