బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అద్భుతమైన నటి. డ్యాన్స్ విషయంలో ఆమె గ్రేస్‌కు సాటి లేదు. ‘గురు’ చిత్రంలోని సూపర్‌హిట్ రెయిన్ సాంగ్ ‘బర్సో రే మేఘా’పై ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ యువతను ఉర్రూతలూగిస్తున్నది. ఈ పాటపై ఇన్‌స్టాలో పెద్ద సంఖ్యలో రీల్స్ దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా, ముగ్గురు యువకులు ఈ పాటపై ఫన్నీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో హరి మునియప్పన్, విక్కల్స్ విక్రమ్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హరి, అతడి స్నేహితులు ‘బర్సోరే మేఘా’ పాటపై డ్యాన్స్ చేశారు. 90ల నాటి పాఠశాల వార్షిక వేడుక ఎలా ఉంటుందో గుర్తుచేశారు. ఒకరు పర్ఫెక్ట్గా స్టెప్పులేస్తుంటే, ఇంకొకరు స్టెప్పులు మరిచిపోయి కంగారుపడడం నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 21.7 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. 2 మిలియన్ల లైక్‌లతో రీల్ వైరల్‌గా మారింది.