కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కారు శాఖహార భోజనాన్ని ప్రోత్సహిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ (Derek OBrien) ఆరోపించారు. స్కూల్ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం లేదని, మధ్యాహ్నం భోజనం నుంచి కోడి గుడ్డును తొలగించే అవకాశాలు ఉన్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మిడ్డే మీల్ స్కీమ్‌ను ఇస్కాన్‌కు అప్పగించడంతో ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మిడ్డే మీల్ స్కీమ్‌లో భాగంగా ఆహారం తయారీ, సరఫరా కోసం ఇస్కాన్ సహకరించనున్నట్లు ఆయన చెప్పారు.
అయితే ఇస్కాన్ మెనూ ప్రకారం.. కోడి గుడ్ల స్థానంలో వృక్ష సంబంధిత ప్రోటీన్‌ను ఇచ్చే ప్రణాళిక ఉన్నది. దీని పట్ల తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. బెంగాలీ ఫుడ్ కల్చర్‌ను మార్చేందుకు బీజేపీ కుట్ర చేసినట్లు డెరిక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. రాజకీయ సమస్యలకు గుడ్లను బీజేపీ వాడుకుంటోందని, అయితే స్కూల్ పిల్లలు పౌష్టికాహారాన్ని కోల్పోతున్నట్లు ఒబ్రెయిన్ తన ఎక్స్‌లో తెలిపారు. ప్రతిపక్ష నేతలపై గుడ్లు విసురుతున్నారని, మిడ్డే మీల్స్ నుంచి వాటిని తీసి వేస్తున్నారని ఎంపీ ఒబ్రెయిన్ ఆరోపించారు. శాఖాహారాన్ని అమలు చేయడాన్ని బెంగాల్ వ్యతిరేకిస్తోందన్నారు.
After the fish🐠eating tamasha during the election campaign, the Gujarat Gymkhana finally reveals itself. New BJP govt at work in Bengal. Throw eggs at rivals. But DEPRIVE CHILDREN of nutrition by taking🥚🥚eggs off from midday meals. Imposing vegetarianism. Bengal rejects this
— Derek O’Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) June 24, 2026